తిరుపతిలో బుద్ధ ధమ్మ విహార ట్రస్ట్ నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ
About This Event
తిరుపతిలో బుద్ధ ధమ్మ విహార ట్రస్ట్ నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని తిరుపతి తెలుగుదేశం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మరియు మాజీమంత్రి డాక్టర్ పనబాక లక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ విశ్రాంత ఉద్యోగులు, కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ అభిమానులు, సామాజిక ఉద్యమకారులు, ప్రముఖ విశ్రాంత ఉద్యోగులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను పెంపొందించడంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను కేవలం విగ్రహాలకే పరిమితం చేయకుండా, వాటిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.